Delhi, Feb 1: 8వ సారి కేంద్ర బడ్జెట్ 2025ని ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బీహార్‌కు(Budget 2025 Boost To Bihar) పెద్దపీట వేశారు. మఖానా బోర్డు ఏర్పాటు, జాతీయ ఆహార సాంకేతిక, వ్యాపార మరియు నిర్వహణ సంస్థ ,గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల(Greenfield Airports) నిర్మాణం వంటివి ఉన్నాయి.
వాస్తవానికి గత ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, జేడీయూ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిహార్‌కు నజరానా ప్రకటించిందనే చెప్పాలి. జేడీయూ మద్దతు నేపథ్యంలో ఈ ప్రణాళికలు ప్రత్యేక ప్రాధాన్యత పొందాయి.
()మఖానా బోర్డు ఏర్పాటు( Makhana Board) – ఉత్తర బీహార్ రైతులకు కేంద్ర పథకాల ప్రయోజనాలు అందించేందుకు మఖానా బోర్డును స్థాపించనున్నారు.
()గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు(Greenfield Airports) – బీహార్‌లో పౌర విమానయానాన్ని పెంపొందించేందుకు కొత్త ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేయనున్నారు.
()మిథిలాంచల్ కాలువ ప్రాజెక్ట్ – మిథిలాంచల్ ప్రాంత రైతులకు ప్రయోజనం కలిగించేలా కొత్త కాలువ ప్రాజెక్టును ప్రకటించారు.
() ఐఐటీ పాట్నా విస్తరణ(Patna IIT) – రాష్ట్ర విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ఐఐటీ పాట్నాను సామర్థ్యాన్ని పెంచి విస్తరించనున్నారు. కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్.. ఐటీ చెల్లింపు దారులకు ఎదురుచూపులే, ఎలాంటి ప్రకటన చేయని నిర్మలా, వచ్చే వారం ఆదాయపు పన్ను బిల్లు ఉంటుందని వెల్లడి
2024 లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకున్న జేడీయూ, బీజేపీకి మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. ఇక బిహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, జేడీయూ మైత్రి బలంగా కొనసాగాలని బీజేపీ భావిస్తోంది. అందుకే బిహార్‌కు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.
ఇక దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. బిహార్‌కు పెద్దపీట వేయడం ఇది కొత్తేమీ కాదని కానీ ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించడం సరికాదని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.