వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు.
...