భారతదేశంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర, గోవా వంటి ప్రాంతాల్లో జరుపుకునే వినాయక నిమజ్జనంకు ఎంతో గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పది రోజుల పాటు జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాల్లో చివరి రోజు అనంత చతుర్దశిగా పిలుస్తారు. ఈ రోజున భక్తులు గణపతికి వీడ్కోలు చెబుతూ.. నదులు, సరస్సులు లేదా సముద్రంలో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.
...