భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని, అంటే సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. రాధాకృష్ణన్ దేశ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి రెండు పదవులను నిర్వహించారు. ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడిగా గుర్తింపును చివరి వరకు కొనసాగించారు.
...