
Teacher's Day Wishes In Telugu: భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని, అంటే సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. రాధాకృష్ణన్ దేశ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి రెండు పదవులను నిర్వహించారు. ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడిగా గుర్తింపును చివరి వరకు కొనసాగించారు. ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ.
టీచర్స్ డే సందర్భగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..
ఈ ప్రత్యేక రోజున శుభాకాంక్షలను పంపడం ద్వారా మీ గురువుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సమయం ఆసన్నమైంది. ప్రతి వ్యక్తి జీవితంలో గురువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గురువు లేకపోతే జీవితం పూర్తిగా చీకటి.గురువు మార్గదర్శకత్వం లేకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవడం చాలా కష్టం. ఉపాధ్యాయ దినోత్సవం రోజున శుభాకాంక్షలను పంపడం ద్వారా మీ గురువుకు మీ కృతజ్ఞతలు తెలియజేయవచ్చు.

హ్యాపీ టీచర్స్ డే

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః -హ్యాపీ టీచర్స్ డే

ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.. దానికి ఆధారమైన దారం గురువు- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం. అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

నా ఎదుగుదలనే గురు దక్షిణగా భావించే నా ప్రియమైన గురువు గారికి.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఈ ప్రపంచానికి మీరు కేవలం ఉపాధ్యాయులే కావచ్చు. మాకు మాత్రం మీరే కథానాయకులు - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు