సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ ప్రజలు నిజాం పాలన కఠినత్వం, రజాకార్ల దౌర్జన్యం, స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రోజులు గడుపుతున్నారు. ఆ కష్టకాలంలో తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా, 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది.
...