అధిక రక్తపోటు (హై బీపీ) అనే సమస్య ఇంతకు ముందు వయసు ఎక్కువగా పైబడినవారిలో మాత్రమే చూశాం. అయితే ప్రస్తుతం ఈ సమస్య యువతలో కూడా ఎక్కువగా విస్తరిస్తోంది. పనిభారం, ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లోపించడం, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు వంటి కారణాలు ఈ సమస్యను వేగంగా పెంచుతున్నాయి.
...