
చాలా మంది రక్తపోటు పెరగడాన్ని పెద్దగా పట్టించుకోవడ లేదు. కానీ హై బీపీని నిర్లక్ష్యం చేస్తే మాత్రం గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాపాయ పరిస్థితులు రావచ్చు. అందుకే ఈ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వారు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.
ఉప్పు (సోడియం) వినియోగం తగ్గించాలి: ఉప్పులో ఉండే సోడియం అధిక రక్తపోటుకు ప్రధాన కారణం. అందుకే హై బీపీ ఉన్నవారు ఉప్పును గరిష్టంగా తగ్గించుకోవాలి. కొందరికి భోజనం తర్వాత కూడా అదనంగా ఉప్పు చల్లుకుని తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు రక్తపోటును మరింత పెంచుతుంది. కాబట్టి ఇలాంటి అలవాట్లను మానేయాలి. సముద్రపు ఉప్పు కన్నా రాతి ఉప్పు (rock salt) ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన మాంసం మానేయాలి: సాసేజ్, సలామీ, బేకన్ వంటి ప్రాసెస్ చేసిన మాంసం పదార్థాలలో ఎక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. ఈ మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పును అధికంగా కలుపుతారు. ఇవి రక్తపోటును వేగంగా పెంచుతాయి. అలాగే వీటిని బ్రెడ్, చీజ్, సాస్‌తో కలిపి తినడం వల్ల కూడా సమస్య మరింత తీవ్రంగా అవుతుంది. కాబట్టి హై బీపీ ఉన్నవారు ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి.
Health Tips: అశ్వగంధ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
కాఫీ, కెఫీన్ పానీయాలు తగ్గించాలి: కాఫీ, కెఫీన్ ఉన్న పానీయాలు రక్తపోటును తాత్కాలికంగా గణనీయంగా పెంచుతాయి. హై బీపీతో బాధపడుతున్న వారు రోజువారీగా కాఫీ తాగడం మానుకోవడం మంచిది. దీని బదులుగా హర్బల్ టీలు లేదా తక్కువ కెఫీన్ ఉన్న పానీయాలను ఎంచుకోవచ్చు.
ప్యాక్ చేసిన ఆహారాలు దూరం పెట్టాలి: మార్కెట్లో దొరికే ప్యాక్ చేసిన స్నాక్స్, సూప్స్, ఇన్‌స్టంట్ ఫుడ్స్, రెడీమేడ్ సాస్‌లలో సోడియం అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా తినడం రక్తపోటును క్రమంగా పెంచుతుంది. అందువల్ల ఇంట్లో ఆరోగ్యకరంగా వండిన ఆహారాన్ని తినే అలవాటు చేసుకోవాలి.
ఫాస్ట్‌ఫుడ్ డీప్‌ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించాలి: బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌లో ఉప్పు, ఫ్యాట్ రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇవి కేవలం బీపీనే కాకుండా ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి