చోళ, పాండ్య, కాకతీయ రాజుల కాలాల్లోని అబ్బురపడే ఆలయ నిర్మాణాకృతులను చూసి అబ్బురపడటం తెలిసిందే. ఇప్పుడు సిద్దిపేట శివారులో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో ఓ ఆలయం రూపుదిద్దుకుంటోంది. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలోని ఓ టౌన్‌షిప్‌లో అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది.
...