Credits: Twitter

Siddipet, June 2: చోళ (Cholas), పాండ్య (Pandyaas), కాకతీయ (Kakatiya) రాజుల కాలాల్లోని అబ్బురపడే ఆలయ నిర్మాణాకృతులను చూసి అబ్బురపడటం తెలిసిందే. ఇప్పుడు సిద్దిపేట (Siddipet) శివారులో త్రీడీ ప్రింటింగ్ (3D Printing)సాంకేతికతతో ఓ ఆలయం రూపుదిద్దుకుంటోంది. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలోని ఓ టౌన్‌షిప్‌లో అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని రోబో సాయంతో మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు.

Telangana Formation Day: కేంద్రం తరఫున గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కిషన్‌ రెడ్డి.. వీడియో

ఏయే ఆలయాలు అంటే?

ఆలయంలో శివుడు, పార్వతి, వినాయకుడి గర్భగుడులు ఉంటాయి. ఇప్పటికే వినాయకుడు, శివాలయాలు పూర్తయ్యాయి. రోబోలో సాఫ్ట్‌ వేర్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ఆలయం నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నామని, ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనని కంపెనీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

Agni-1: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి అగ్ని-1, బాలిస్టిక్‌ మిస్సైల్‌ అసాధారణమైన ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని తెలిపిన రక్షణ మంత్రిత్వశాఖ