30 ఏళ్ల కోర్బిన్ ఇటు బంతితో, అటు బ్యాట్‌తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు (4/63) పడగొట్టిన ఈ ఫాస్ట్ బౌలర్.. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 93 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే అరంగేట్రంలో నాలుగు వికెట్లు, అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
...