Centurion Park, DEC 27: దక్షిణాఫ్రికా బౌలింగ్ ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్ (Corbin Bosch) అరంగేట్రంలోనే క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో (SA vs PAK) జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన 30 ఏళ్ల కోర్బిన్ (Centurion Park ).. ఇటు బంతితో, అటు బ్యాట్‌తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు (4/63) పడగొట్టిన ఈ ఫాస్ట్ బౌలర్.. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 93 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే అరంగేట్రంలో నాలుగు వికెట్లు, అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఈ క్రమంలోనే టెస్టుల్లో అరంగేట్ర మ్యాచ్‌లో 9వ స్థానంలో వచ్చి అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు మిలన్ రత్నాయకే (72) పేరిట ఉండేది.
Corbin Bosch Achieves Rare Test Feat For South Africa
A half-century on his debut!😃
A fairytale start to Corbin Bosch’s Test Match career for the Proteas so far.🏏🇿🇦✨#WozaNawe#BePartOfIt #SAvPAK pic.twitter.com/emg6guuLfp
— Proteas Men (@ProteasMenCSA) December 27, 2024
ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 211 పరుగులకు ఆలౌటైంది. 82/3తో రెండో రోజు (శుక్రవారం) ఆటను ప్రారంభించిన సఫారీలు.. 301 పరుగులకు ఆలౌటయ్యారు. ఓపెనర్ మార్‌క్రమ్ (89; 144 బంతుల్లో) రాణించగా.. టాప్ ఆర్డర్‌లో మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయలేదు. బావుమా (31), బెడింగ్‌హామ్ (30) పరుగులు చేశారు. జట్టు స్కోరు 213 పరుగుల వద్ద మార్‌క్రమ్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోర్బిన్ బాష్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు 90 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రబాడ (13), ప్యాటర్సన్ (12).. కోర్బిన్‌కు సహకరించారు.