
Hyderabad, Mar 10: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ట్రోఫీని (Champions Trophy 2025) ముద్దాడింది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ (Hyderabad)లో పలుచోట్ల క్రికెట్ ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి బాణసంచా కాల్చారు. జై భారత్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో దిల్ సుఖ్ నగర్ ఏరియాలో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేసే క్రమంలో లాఠీ ఛార్జ్ (Lathi Charge On Cricket Fans) చేశారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. అయితే లేట్ నైట్ కావడంతో ఆ సమయంలో గుంపులు గుంపులుగా రోడ్లపైకి జనాలు వచ్చి బాణసంచా పేల్చడంతో వాహనదారులు ఇబ్బండి పడతారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని వారిని ఇండ్లకు పంపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో నిన్న రాత్రి యువత రచ్చ
హైదరాబాద్-దిల్సుఖ్నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు భారీగా ట్రాఫిక్ జామ్.
లాఠీఛార్జ్ చేసి యువకులను చెదరగొట్టిన పోలీసులు. pic.twitter.com/A1uArnDxIP
— ChotaNews App (@ChotaNewsApp) March 10, 2025
This is how the Congress govt. in Telangana not allowing India’s #ChampionsTrophy2025 win celebrations.
Shameful! pic.twitter.com/OxIdrfkn90
— G Kishan Reddy (@kishanreddybjp) March 9, 2025
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
దిల్‌సుఖ్ నగర్ సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారత్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న అభిమానులను పోలీసులు అడ్డుకోవడం దారుణమంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. వారిపై లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు. కాగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ (76) కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. బౌలర్లు సమష్టిగా రాణించడంతో న్యూజిలాండ్ పై మరో 6 బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2013 తరువాత 12 ఏళ్లకు మరో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరిన విషయం తెలిసిందే.
వీడియోలు ఇవిగో.. విల్ యంగ్, కేన్ విలియమ్సన్ ఎలా ఔట్ అయ్యారో చూడండి, భారత స్పిన్నర్లు అద్భుత బౌలింగ్!