Rohit Sharma (Image: Rohit Sharma/X

Newdelhi, Mar 10: చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) అనంతరం వన్డేల నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma Clarity On Retirement) తప్పుకోబోతున్నాడట.. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యి సోషల్ మీడియాతో పాటు అంతటా తెగ హల్‌ చల్ చేశాయి. తమ అభిమాన క్రీడాకారుడి వన్డే క్రికెట్ ను ఇక చూడలేమా? అంటూ ఈ వార్తలపై రోహిత్ అప్పటివరకూ తెగ ఫీల్ అయ్యారు. ఈ వార్తలపై అటు రోహిత్ కూడా ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అయితే, గత రాత్రి న్యూజిలాండ్‌ తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ లో భారత జట్టు ఘన విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ రిటైర్మెంట్ వార్తలకు ఎట్టకేలకు చెక్ పెట్టాడు.

అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.

ఏమన్నాడు అంటే?

తన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు లేవని, కాబట్టి రిటైర్మెంట్‌ కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరాడు. వన్డే ఫార్మాట్ నుంచి తాను ఇప్పుడే రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ఆనందంగా ఉందన్న రోహిత్.. టోర్నీ మొత్తం బాగా ఆడినట్టు చెప్పాడు. జట్టు తనకు అండగా నిలిచిందని పేర్కొన్నాడు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు