KCR-Dasoju Sravan (Credits: X)

Hyderabad, Mar 10: తెలంగాణలో (Telangana) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Candidates) నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించింది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తమ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు.

ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్

అప్పుడు అలా..

దాసోజు శ్రవణ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 జూలైలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అప్పటి ప్రభుత్వం సిఫార్సు చేసింది. కానీ సాంకేతిక కారణాలతో అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో సీనియర్ నాయకుడిగా ఉన్న శ్రవణ్ గతంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా కూడా నియమితులయ్యారు.

వీడియోలు ఇవిగో.. విల్ యంగ్, కేన్ విలియమ్సన్ ఎలా ఔట్ అయ్యారో చూడండి, భారత స్పిన్నర్లు అద్భుత బౌలింగ్!