Credits: Twitter

Arasavalli, Mar 10: శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత అరసవెల్లి (Arasavalli) సూర్యనారాయణ స్వామి ఆలయం గురించి తెలియని తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలు లేరు. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్‌ ను తాకే అద్భుత దృశ్యాన్ని చూడాలనుకునే భక్తులు లక్షల మంది ఉంటారు. అయితే, ఆ భక్తులకు వరుసగా రెండో రోజు నిరాశ ఎదురైంది. సోమవారం ఉదయం కూడా సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్‌ ను తాకలేకపోయాయి. ప్రతి సంవత్సరం రెండుసార్లు జరిగే ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే, పొగమంచు, మేఘాలు ఆటంకంగా ఉండటంతో స్వామివారి మూలవిరాట్‌ ను కిరణాలు తాకలేకపోయాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

ఆదివారం కూడా ఇదే పరిస్థితి

ఉత్తరాయణ, దక్షిణాయణ కాలాల్లో మార్పుల సమయంలో, ప్రతి సంవత్సరం మార్చి 9, 10 మరియు అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి విగ్రహాన్ని తాకడం ఆనవాయితీగా వస్తోంది. మార్చి 9 అంటే ఆదివారం సెలవు దినం కావడంతో, సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయని భావించి వేలాదిగా భక్తులు ఉదయం 6 గంటలకే ఆలయానికి చేరుకున్నారు. భక్తులు సూర్యకిరణాల కోసం వేచి చూసినప్పటికీ, మేఘాల కారణంగా కిరణ స్పర్శ జరగలేదు. నేడైనా ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలుగుతుందేమోనని భక్తులు ఎదురుచూసినా నేడు కూడా ఆ భాగ్యం దక్కలేదు.

ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్