
Del, Feb 16: తల్లి ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంత ఎత్తుకు ఎదిగిన తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. తాజాగా ఓ కొడుకు రిటైర్మెంట్ సందర్భంగా 94 ఏళ్ల తల్లి సర్‌ప్రైజ్ ఇచ్చింది(Emotional Video). లైవ్ రేడియో షోకు కాల్ చేసి, అతడి చేత కన్నీళ్లు పెట్టించింది. ఈ వీడియో ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా వ్యూస్ సాధించగా నెటిజన్లు సైతం ఎమోషనల్ కామెంట్ చేస్తున్నారు(mother surprises her son).
వీడియో ప్రారంభంలో.. రేడియో హోస్ట్, మీరు లైవ్‌లో ఉన్నారు(live radio call), ముందుకు సాగండి అని చెప్పగా హాయ్ స్టీవెన్, ఇది నీ 94 ఏళ్ల తల్లి. నీ రిటైర్మెంట్‌కు(son retirement) శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నామో తెలుసా? నువ్వు ఏం చేసినా విజయవంతమే అవుతావు అని తల్లి చెప్పింది. దీంతో కన్నీళ్లు ఆపుకోవడానికి ప్రయత్నించి ధన్యవాదాలు అమ్మా… థాంక్స్ మామ్ అని ఎంతో భావోద్వేగంతో స్పందించాడు.
ఇదే నిజమైన ప్రేమ. తల్లిప్రేమకు సమానం మరేమీ లేదు అని నెటిజన్ల ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆమె మాటల్లోని ప్రేమ వినగానే నాకు కన్నీళ్లు వచ్చాయి. స్టీవెన్ నిజంగా అదృష్టవంతుడు అని మరికొంతమంది చెప్పారు.
Son retirement.. 94 year old mother surprise, video goes viral
View this post on Instagram
ఈ వీడియో చూసాక నాకు నా తల్లి గుర్తొచ్చింది. తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండి అని భావోద్వేగంతో కామెంట్ చేశారు. 94 ఏళ్ల వయసులో కూడా తన కొడుకు కోసం ఇలా ఆదరాభిమానాలు చూపించడం – అదే నిజమైన తల్లిప్రేమ అన్నారు.తల్లిప్రేమకు వయసుతో సంబంధం లేదు" అనే మాటను మరోసారి నిరూపించిందని.. మనం ఎంత పెద్దవాళ్లైనా, తల్లిదండ్రుల ప్రేమ, సహాయం ఎప్పటికీ అమూల్యమేనని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.