
Newyork, Feb 16: అమెరికాలోని (America) ఉటాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లేటన్ లో ఓ కారు రైల్వే (Train) ట్రాక్ దాటే సమయంలో రైలు గేటు పడింది. అప్పటికే కారు ట్రాక్ మీదికి వెళ్లింది. దీంతో కారును వెనక్కి తీసుకురావడానికి డ్రైవర్ ప్రయత్నించినప్పటికీ గేట్ పడటంతో సాధ్యం కాలేదు. అప్పటికే రైలు రావడంతో వెంటనే కారు దిగి డ్రైవర్ వెనక్కి పరిగెత్తాడు. దీంతో వేగంగా వచ్చిన రైలు కారును ఢీ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Here's Video:
ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు
ఇటీవల ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినట్టు కనిపించే ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ప్రమాదంలో ఇంజిన్ పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ, పెద్దగా ప్రాణనష్టం జరగలేనట్టు కనిపిస్తుంది. అయితే, ఈ ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న విషయాలు తెలియరాలేదు.