Driverless Electric Vehicle: డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రూపొందించిన బోసన్ మోటార్స్, మంత్రి నారా లోకేష్ సమక్షంలో విజయవంతంగా డెమో ప్రదర్శన...వీడియో ఇదిగో

ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు మంత్రి నారా లోకేష్.

Driverless Electric Vehicle: డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రూపొందించిన బోసన్ మోటార్స్, మంత్రి నారా లోకేష్ సమక్షంలో విజయవంతంగా డెమో ప్రదర్శన...వీడియో ఇదిగో
Boson Motors reveals driverless electric Vehicle(video grab)

America, Oct 27: ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ టార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు మంత్రి నారా లోకేష్.

ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ఆన్ వ్యూ సొల్యూషన్స్ ప్రతినిధి జోయల్ వివరించారని లోకేష్ తెలిపారు. స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ డెమోను ప్రదర్శించారు. ఫాల్కన్ ఎక్స్ ప్రతినిధులు తమసంస్థ సిరిస్ ఎ స్టార్టప్ లతో వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్న పోర్ట్ ఫోలియోలను వివరించానని తెలిపారు.  శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి నారా లోకేష్, ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయం సందర్శన, పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం 

Here's Video:

డిజిసెర్ట్ సిఇఓ అమిత్ సిన్హా తమ సంస్థ డిజిటల్ సర్టిఫికేషన్, భద్రతలకు సంబంధించి డిజిసెర్ట్ సురక్షితమైన ఆన్ లైన్ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. సంస్థల అనుబంధ యూనిట్లను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయాలని కోరానని..సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమలస్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని కంపెనీ ప్రతినిధులకు చెప్పినట్లు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Oct 27, 2024 12:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).