Student Paraglides To Exam Centre: పారాగ్లైడింగ్ చేస్తూ పరీక్షా కేంద్రానికి వెళ్లిన విద్యార్థి.. మహారాష్ట్రలో ఘటన.. ఎందుకంటే? (వీడియోతో)
సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సిటీలో భారీ ట్రాఫిక్ ను చేదించడానికి మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక విద్యార్థి పారాగ్లైడింగ్ అనే అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
Mumbai, Feb 16: సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సిటీలో భారీ ట్రాఫిక్ (Traffic) ను చేదించడానికి మహారాష్ట్రలోని (Maharastra) సతారా జిల్లాలో ఒక విద్యార్థి పారాగ్లైడింగ్ అనే అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. పసారాని గ్రామానికి చెందిన సమర్థ్ మహంగడే పరీక్ష రోజున వ్యక్తిగత పనుల కారణంగా పంచగనిలో ఉండిపోయాడు. అయితే, ఆ పనులు ఆలస్యమయ్యాయి. దీంతో వాటిని చక్కబెట్టుకునే క్రమంలో పరీక్ష సమయాన్ని కూడా సమర్థ్ మరిచిపోయాడు. అలా ఎలాగోలా ఆ పనులను పూర్తిచేశాడు. తీరా పరీక్షకు సమయం ఎంత ఉందని వాచీ చూసుకున్నాడు.
Here's Video:
మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన సమర్థ్ అనే విద్యార్థి పరీక్షా కేంద్రానికి పారాగ్లైడింగ్ చేసుకుంటూ వెళ్లాడు. వ్యక్తిగత పనుల కారణంగా టైమ్ దాటిపోతుండటంతో ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు పారాగ్లైడింగ్ చేసుకుంటూ ఎగ్జామ్ హాల్ వద్దకు చేరుకున్నాడు. pic.twitter.com/DP5OGkFXEN
— ChotaNews App (@ChotaNewsApp) February 16, 2025
దీంతో ట్రాఫిక్ ను దాటడానికి..
పరీక్షకు 15-20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉందని గ్రహించిన సమర్థ్ అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలంటే ట్రాఫిక్ ను దాటాల్సి ఉంటుందని గమనించాడు. దీంతో టైమ్ దాటిపోతుండటంతో ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు పారాగ్లైడింగ్ చేసుకుంటూ ఎగ్జామ్ హాల్ వద్దకు చేరుకున్నాడు. విద్యార్థి పారాగ్లైడింగ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
(The above story first appeared on LatestLY on Feb 16, 2025 07:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

