దేశంలోని పలు రాష్ట్రాలకు ఇంఛార్జీలను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జీగా మీనాక్షి నటరాజన్‌ను(Meenakshi Natarajan)ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.
దీపాదాస్ మున్షీపై(Deepadas Munshi) తప్పుడు ప్రచారం జరుగతున్న నేపథ్యంలో దానిని ఖండించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud). దీపాదాస్ మున్షీ నిబద్ధత, క్రమశిక్షణ గల నాయకురాలు అన్నారు.
కొన్ని దినపత్రికలు, ప్రసార మాద్యమాలలో దీపాదాస్ ముంన్షి పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసారని ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం అన్నారు.
కేరళ ఏఐసీసీ ఇంచార్జ్ గా(Kerala AICC Incharge) ఉంటూ తెలంగాణ లో ఏడాది కాలం పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కి కేరళలో పూర్తి బాధ్యతలతో పనిచేయాల్సి ఉన్నందున ఇక్కడ కొత్త నియామకం జరిగిందే తప్ప ఎలాంటి చర్యలు కావు అని తేల్చిచెప్పారు. ఆమెపై వచ్చిన వార్తలను ఖండిస్తున్నాం. నిరాధార వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)