![](https://test1.latestly.com/uploads/images/2025/02/8-211.jpg?width=380&height=214)
Hyderabad, Feb 15: హైదరాబాద్ లో (Hyderabad Accident) రోజురోజుకూ వాహన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా లగ్జరీ ప్రాంతాలుగా చెప్పుకొనే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో కారు ప్రమాదాలు, ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు (BMW Car) ఒకటి బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీ చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టి భయోత్పాతం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ దిమ్మెల్ని కారు ఢీకొనడంతో కారు టైర్, ఆయిల్ ట్యాంకర్ పేలిపోయాయి. అయితే కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Here's Video:
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం
ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని అతివేగంతో ఢీకొట్టిన కారు
అదుపుతప్పి డివైడర్ దిమ్మెల్ని ఢీకొనడంతో పగిలిన కారు టైర్, ఆయిల్ ట్యాంకర్
మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఉంటాడనే అనుమానాలు
కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో… pic.twitter.com/wUQPPGVCPj
— BIG TV Breaking News (@bigtvtelugu) February 15, 2025
యజమాని ఎవరంటే??
కారు నంబర్ ప్లేట్ (TS09FY9990) ఆధారంగా ఓనర్ ను పోలీసులు గుర్తించారు. మాలిక్ జెమ్స్ అండ్ జ్యవెలరీ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు వాళ్లు తేల్చారు. ఇప్పటికే కారుపై రెండు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎంతమంది ఉన్నారనే విషయమై సీసీటీవీ వీడియోలను పరిశీలిస్తున్నారు. అయితే, కారు అంత వేగంతో వచ్చే సమయంలో రోడ్డు మీద ఇంకా ఎవరైనా ఉంటే ప్రాణాలు పోయేవని స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.