AP Artist Celebrates Team India Victory (Credits: X)

Vijayawada, Mar 10: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ట్రోఫీని (Champions Trophy 2025) ముద్దాడింది. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం కళాకారుడు పురుషోత్తం(పూరి ఆర్ట్స్) గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. రోహిత్, కోహ్లీ స్నేహబంధాన్ని గుర్తు చేస్తూ నేలపై అద్భుతంగా చిత్రాన్ని చిత్రీకరించి నీరాజనాలు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రాలు వైరల్ గా మారాయి. కాగా దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ (76) కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. బౌలర్లు సమష్టిగా రాణించడంతో న్యూజిలాండ్ పై మరో 6 బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2013 తరువాత 12 ఏళ్లకు మరో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరిన విషయం తెలిసిందే.

క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్‌ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్ లో లాఠీ ఛార్జ్

ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి ట్రోఫీని గెలువడంతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌ (Hyderabad)లో పలుచోట్ల క్రికెట్ ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి బాణసంచా కాల్చారు. జై భారత్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో దిల్‌ సుఖ్ నగర్‌ ఏరియాలో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ మీద పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేసే క్రమంలో లాఠీ ఛార్జ్ (Lathi Charge On Cricket Fans) చేశారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.

ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్