జనవరి 22 నుంచి భారత్-ఇంగ్లాండ్ (IND Vs ENG) మధ్య ఐదు మ్యాచుల టీ20 (T20 Match) సిరీస్ ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు శనివారం కోల్‌కతా (Kolkata)కు చేరుకున్నాయి. మూడు సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది.
...