
Kolkata, JAN 18: జనవరి 22 నుంచి భారత్-ఇంగ్లాండ్ (IND Vs ENG) మధ్య ఐదు మ్యాచుల టీ20 (T20 Match) సిరీస్ ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు శనివారం కోల్‌కతా (Kolkata)కు చేరుకున్నాయి. మూడు సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ (England)పై భారత్ (India) రికార్డు అద్భుతంగా ఉన్నది. రెండు జట్ల మధ్య మొత్తం 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత జట్టు 13 మ్యాచ్‌లను గెలిచింది. మరో 11 మ్యాచుల్లో ఓడిపోయింది.
సౌతాఫ్రికాలో (South Africa) జరిగిన ఎస్‌ఏ 20 లీగ్‌లో పాల్గొన్న ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ నేరుగా భారత్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ నేతృత్వంలోని మిగతా బృందం సాయంత్రం దుబాయి మీదుగా కోల్‌కతాకు చేరుకుంది. ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు సైతం కోల్‌కతాకు చేరారు. నితీశ్ కుమార్‌రెడ్డి, రింకు సింగ్ సాయంత్రం 4.30 గంటలకు చేరుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ చేరగా.. ఆ తర్వాత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మిగతా ఆటగాళ్లు సాయంత్రానికి చేరారు.
India and England National Cricket Teams Arrive in Kolkata
🚨 England Cricket Team have Reached India for the 5 T20s and 3 ODIs.#INDvsENG pic.twitter.com/OPoiem5GYg
— Sheeza Khan (@Pmln_gulf92) January 18, 2025
దాదాపు దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మహ్మద్ షమీ మరింత ఆలస్యంగా కోల్‌కతాకు చేరుకోనున్నట్లు సమాచారం. పాండ్యా సైతం ఆలస్యంగా జట్టుతో చేరనున్నాడు. మ్యాచ్‌కు ముందు రెండు జట్లు మూడు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటాయి. ఈ నెల 22న తొలి టీ20 మ్యాచ్, రెండో టీ20 ఈ నెల 25న చెన్నైలో, మూడో టీ20 ఈ నెల 28న రాజ్‌కోట్‌లో జరుగనున్నది. నాలుగో మ్యాచ్ జనవరి 31న పుణేలో, చివరిదైన ఐదో టీ20 ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.