మహిళల మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక చివరి మ్యాచ్‌లో (IND-W vs WI-W) భారత్ విజయ ఢంకా మోగించింది. 60 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
...