టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీతో (Rohit Sharma Century) చెలరేగాడు. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (2nd ODI) కేవలం 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు బాది మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 32వ శతకం.
...