Rohit Sharma (Image: Rohit Sharma/X

Cuttack, FEB 09: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఎట్ట‌కేల‌కు ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ సెంచ‌రీతో (Rohit Sharma Century) చెల‌రేగాడు. క‌ట‌క్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో (2nd ODI) కేవ‌లం 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు బాది మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. వ‌న్డేల్లో రోహిత్‌కు ఇది 32వ శ‌త‌కం. ఇప్ప‌టికే వ‌న్డేల్లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన ప్లేయ‌ర్ల జాబితాలో రోహిత్ శ‌ర్మ మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఈ జాబితాలో ప‌రుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 50 శ‌త‌కాల‌తో తొలి స్థానంలో ఉండ‌గా 49 శ‌త‌కాలో దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల‌ర్ రెండో స్థానంలో ఉన్నాడు.

India vs England, 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ, కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి  

వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్లు వీరే..

విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 50 సెంచ‌రీలు

స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – 49 సెంచ‌రీలు

రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 32 సెంచ‌రీలు

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 30 సెంచ‌రీలు

స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక‌) – 28 సెంచ‌రీలు

Rohit Sharma Slams 32nd ODI Ton

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 49.5 ఓవ‌ర్ల‌లో 304 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఆరంభం నుంచే భారీ షాట్ల‌తో చెల‌రేగాడు. సిన్న‌ర్లు, పేస‌ర్లు అనే తేడా లేకుండా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ సిక్స‌ర్లు, ఫోర్ల వ‌ర్షం కురిపించాడు.