India vs England, 2nd ODI.. England won the toss opted to bat

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్(India vs England, 2nd ODI). కటక్‌లోని బారబతి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా(Team India). జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ(Virat Kohli), కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులో చోటు దక్కించుకున్నారు.

"మొదటి మ్యాచ్‌లో మా ప్రదర్శన చాలా బాగుందన్నారు కెప్టెన్ రోహిత్ శర్మ. శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యార్, అక్షర్ పటేల్ చక్కగా బ్యాటింగ్ చేయడంతో విజయం సాధించామన్నారు. జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్‌, ఏకంగా 600 వికెట్లు తీసి లెజెండ్స్ సరసన నిలిచిన జడ్డూ

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి

ఇంగ్లాండ్ జట్టు :

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జేమీ ఓవర్టన్, అట్కిన్సన్, అడిల్ రషీద్, మార్క్ వుడ్, సాఖిబ్ మహ్మూద్