సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపుతోంది.స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (SRPF) చెందిన జవాన్ ప్రకాష్ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలవులపై తన స్వస్థలం మహారాష్ట్రలోని జలగావ్‌జిల్లా జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాష్.. అక్కడే ఈ ఘటనకు పాల్పినట్లు పేర్కొన్నారు.
...