 
                                                                 సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపుతోంది.స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (SRPF) చెందిన జవాన్ ప్రకాష్ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలవులపై తన స్వస్థలం మహారాష్ట్రలోని జలగావ్‌జిల్లా జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాష్.. అక్కడే ఈ ఘటనకు పాల్పినట్లు పేర్కొన్నారు. టీమ్ ఇండియా ప్రధాన కోచ్ కావడానికి వేలమంది అభిమానులు దరఖాస్తు, Google ఫారమ్‌ను షేర్ చేసిన బీసీసీఐ
39 ఏళ్ల కపడే తన సర్వీస్ గన్‌తో మెడపై కాల్చుకుని మరణించినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల ఖచ్చిత కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. వీవీఐవీ భద్రత కోసం నియమించిన గార్డు ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ ఘటనపై SRPFస్వతంత్ర విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
