Viral Classroom Video: అది తల అనుకున్నావా.. తబలా అనుకున్నావా సామి.. విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్‌.. వీడియో వైరల్‌ కావడంతో సస్పెండ్‌

ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చేసిన పని తీవ్ర వివాదాస్పదంగా మారింది. సైఫాయి బ్లాక్‌లోని బిరౌలి ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్న దినేష్ కుమార్ మాథుర్‌.. గుండు చేయించుకుని వచ్చిన ఒక విద్యార్థి తలపై తబలా వాయిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.

Viral Classroom Video: అది తల అనుకున్నావా.. తబలా అనుకున్నావా సామి.. విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్‌.. వీడియో వైరల్‌ కావడంతో సస్పెండ్‌
UP Teacher Suspended for Tapping Tabla on Student’s Head.jpg

Viral Classroom Video: ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చేసిన పని తీవ్ర వివాదాస్పదంగా మారింది. సైఫాయి బ్లాక్‌లోని బిరౌలి ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్న దినేష్ కుమార్ మాథుర్‌.. గుండు చేయించుకుని వచ్చిన ఒక విద్యార్థి తలపై తబలా వాయిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.  సరదా పేరుతో తరగతి గదిలో తన కుర్చీ ముందు నేలపై కూర్చున్న విద్యార్థి గుండును తబలా అనుకుంటూ తన చేతులతో వాయించారు. ఈ దృశ్యాన్ని వీడియో రికార్డ్ చేయించడమే కాకుండా, స్వయంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.  వీడియో ఇదిగో.. మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న జెడీయూ ఎమ్మెల్యే.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

అవహేళన చేయడం ఎంతవరకు న్యాయం?

విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడే ఒక విద్యార్థిని ఈ రకంగా అవహేళన చేయడం, నలుగురిలో నవ్వులపాలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఇలా ఎగతాళి చేయడం వల్ల ఆ విద్యార్థి మనస్తాపానికి గురయ్యే ప్రమాదం ఉంది.

తోటి పిల్లల ముందు చిన్నతనంగా భావించి చదువుపై శ్రద్ధ తగ్గడమే కాకుండా, నలుగురిలోకి రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాధ్యాయులు దీనిని "సరదా" అని సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఒక విద్యార్థి శరీరాకృతిని లేదా రూపాన్ని ఆధారంగా చేసుకుని అందరి ముందు పరిహాసాలు చేయడం ఏమాత్రం తగదు. ఇది ఒక రకమైన మానసిక వేధింపు కిందకే వస్తుంది. విద్యార్థిని గేలి చేస్తూ చేసిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం ఆ టీచర్ బాధ్యతారాహిత్యానికి, ప్రచార పిచ్చికి అద్దం పడుతోంది.

UP Teacher Suspended for Tapping Tabla on Student’s Head

ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు విద్యాశాఖకు ఫిర్యాదులు అందడంతో అధికారులు వెంటనే స్పందించి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయులు తరగతి గదిని విజ్ఞాన కేంద్రంగా మలచాలే తప్ప, పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వేదికగా మార్చకూడదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

(The above story first appeared on LatestLY on Oct 13, 2026 05:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).