మహిళల ప్రీమియర్ లీగ్ (WPL -2024) లో శుక్రవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై యూపీ వారియర్స్ (UP Warriors) జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆష్ లైగ్ గార్డనర్ 30, ఫోబే లిచ్ ఫీల్డ్ 35, లారా వోల్వార్డ్ 28 పరుగులు చేశారు.
...