UPW-W vs GG-W WPL 2024: మూడో మ్యాచ్ లోనూ రాణించలేకపోయిన గుజరాత్, ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన యూపీ వారియర్స్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL -2024) లో శుక్రవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై యూపీ వారియర్స్ (UP Warriors) జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆష్ లైగ్ గార్డనర్ 30, ఫోబే లిచ్ ఫీల్డ్ 35, లారా వోల్వార్డ్ 28 పరుగులు చేశారు.
Bangalore, March 01: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL -2024) లో శుక్రవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుపై యూపీ వారియర్స్ (UP Warriors) జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఆష్ లైగ్ గార్డనర్ 30, ఫోబే లిచ్ ఫీల్డ్ 35, లారా వోల్వార్డ్ 28 పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎలకెల్ స్టోన్ మూడు, రాజేశ్వరి గైక్వాడ్ సింగిల్ వికెట్ తీశారు. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని యూపీ వారియర్స్ మరో 26 బంతులు మిగిలి ఉండగానే చేరుకున్నది.
Innings Break!#GG set a 🎯 of 143 for the UP Warriorz!
Will it be enough for #UPW? We'll find out 🔜
Scorecard 💻📱https://t.co/4LUKvUMAOB#TATAWPL | #UPWvGG | @Giant_Cricket | @UPWarriorz pic.twitter.com/gF5mvqEGnn
— Women's Premier League (WPL) (@wplt20) March 1, 2024
నాలుగు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఓపెనర్ ఆల్యేశా హేలీ 33 పరుగులు చేసి బ్రైస్ బౌలింగ్ లో బౌల్డయి పెవిలియన్ దారి పట్టింది. మరో ఓపెనర్ కిరణ్ నావ్ గిర్ 12, చామారి ఆటపట్టు 17 పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గ్రేస్ హారిస్ 60 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లు తనూజా కన్వర్ రెండు, క్యాత్రిన్ బ్రైస్, మేఘనా సింగ్ ఒక్కో వికెట్ తీశారు.
(The above story first appeared on LatestLY on Mar 01, 2024 11:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

