పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ పోటీల్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. వినేశ్ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించాడు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడటం బాధాకరమని అన్నాడు. వినేశ్ రాత్రికిరాత్రి బరువు పెరిగిందని తెలిపాడు.
...