Vinesh Phogat Disqualification

పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. వినేశ్‌ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించాడు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడటం బాధాకరమని అన్నాడు. వినేశ్‌ రాత్రికిరాత్రి బరువు పెరిగిందని తెలిపాడు.

ఏదిఏమైనా రూల్స్‌ను గౌరవించాల్సిందేనని తెలిపాడు. ఇందుకు వినేశ్‌ మినహాంపు కాదని వివరించాడు. వినేశ్‌ స్వల్ప తేడాతోనే అధిక​ బరువు ఉన్నప్పటికీ నిబంధనలను మార్చలేమని తెలిపాడు. బరువు పెరిగిన అథ్లెట్‌ను పోటీకి అనుమతించడం అసాధ్యమని పేర్కొన్నాడు. నిబంధనల ప్రకార​ం అనర్హతకు గురైన అథ్లెట్‌ పోటీలో చివరి స్థానంలో ఉంటారని తెలిపాడు. వినేశ్‌ ఫైనల్లో అమెరికాకు చెందిన సారా హిల్డర్‌బ్రాండ్‌తో తలపడాల్సి ఉండింది. వినేశ్‌ నిష్క్రమణతో సెమీఫైనల్లో ఓడిన క్యూబా క్రీడాకారిణి యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్ ఫైనల్‌కు అర్హత సాధించింది. దేశం మొత్తం మీ వెంటే ఉంది వినేశ్, రాహుల్ గాంధీ ట్వీట్ ఇదిగో, నువ్వు ఎప్పుడూ దేశం గర్వించేలా చేశావంటూ విషెస్

ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో  పోటీపడే అథ్లెట్ల బరువును ఏ రోజైతే బౌట్ ఉంటుందో ఆరోజు ఉదయం తూస్తారు. ప్రతి వెయిట్‌ క్లాస్‌లో పోటీపడే అథ్లెట్లకు తగినంత సమయం ఉంటుంది. రెండు రోజుల వ్యవధిలో తొలి రోజు బరువు కొలిచేందుకు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఈ వ్యవధిలో ఎన్నిసార్లైనా బరువు కొలుచుకోవచ్చు. అయితే, రెండోరోజు మాత్రం ఇందుకు 15 నిమిషాల సమయమే ఉంటుంది. ఈలోపు నిర్ణీత బరువు ఉంటేనే బౌట్‌కు అనుమతిస్తారు