ఇప్పటం ఇళ్లు కూల్చివేశారంటూ వేసిన కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ( AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష (fined one lakh to petitioners) చొప్పున హైకోర్టు జరిమానా విధించింది.
...