⚡పేదల భవిష్యత్‌ను కాపాడుకునే ఈ యుద్ధంలో మీరే స్టార్ క్యాంపయినర్లు: సీఎం జగన్
By Hazarath Reddy
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగింది. ఏటుకూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. గుంటూరులో మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు.