Guntur, April 12: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగింది. ఏటుకూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. గుంటూరులో మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ మహజన సముద్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని తెలిపారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తూ.. 99 శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. వాలంటీర్ల పేర్లు వింటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి, పల్నాడు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లలో వేశామని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించామని పేర్కొన్నారు. 130 సార్లు బటన్ నొక్కి.. నేరుగా పేదల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు. ప్రజలు రెండుసార్లు బటన్ నొక్కి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు. గుంటూరు జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దయిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ వేదిక, వీడియో ఇదిగో..
58 నెలలుగా చేస్తున్న అభివృద్ధిని కొనసాగించేలా ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు వచ్చే ఎన్నికలు చంద్రబాబు మోసాలకు, ప్రజలకు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం అని పేర్కొన్నారు. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా అంటూ సభకు హాజరైన ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.
Here's Full Speech
గుంటూరు జిల్లాలో సీఎం @ysjagan బహిరంగ సభ! Memantha Siddham Yatra, Day-13. #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan https://t.co/HppXiW14gi
— YSR Congress Party (@YSRCParty) April 12, 2024
మనందరి ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు ఇక్కడకు వచ్చిన ప్రతీ అక్కకు, ప్రతీ చెల్లెమ్మకు, ప్రతీ అవ్వకు, తాతకు, ప్రతీ సోదరుడికి ప్రతీ స్నేహితుడికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం తెలిపారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయనంతగా ప్రతీ గ్రామంలోనూ పౌర సేవల్ని, పిల్లల చదువుల్ని, వైద్యాన్ని, రైతులకు అందుతున్న భరోసాను, వీటిన్నితోపాటు అక్క చెల్లెమ్మల సాధికారితను, భద్రతను, అవ్వా తాతాలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా? అని అన్నారు.
గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల డబ్బై వేల కోట్ల రూపాయలు.. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఎక్కడా కూడా వివక్షకు తావులేకుండా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబానికి అందించిన ప్రభుత్వానికి, మీ జగన్‌కు మద్దతుగా, మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కడానికి, మరో వంద మంది చేత నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా? అని అడుగుతున్నా అని సీఎం తెలిపారు.