ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. ఈ రోజు ఉదయం నుంచి ఎండ దంచికొట్టి ఒక్కసారిగా మారిన వాతావరణంతో.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా గుంటూరు సిటీ, తాడికొండ, ప్రత్తిపాడు, మేడికోండూరులోని పలు ప్రాంతాల్లో గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది. ఈ రోజు వైసీపీ పార్టీ తరఫున సీఎం జగన్ సిద్ధం సభ ఏటుకూరు వద్ద జరగనుంది. కాగా అక్కడ కూడా భారీ వర్షం కురవడంతో సిద్ధం సభ నిర్వహణపై నీలినీడలు అలముకున్నాయి. అలాగే వర్షం సమయంలో భారీగా విచిన ఈదురు గాలుల వల్ల సభ కోసం ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, ప్లెక్సీలు సైతం నేలమట్టం అయ్యాయి.  శాంతిస్తున్న సూర్యుడు, తమిళనాడులో 13 జిల్లాల్లో భారీ వర్షాలు, మరో 48 గంటలపాటు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)