Police Case On YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదు... గుంటూరు పర్యటనలో భారీగా ట్రాఫిక్ జాం, రైతులు ఇబ్బందులు పడ్డారని పోలీస్ కేసు నమోదు
వైసీపీ అధినేత మాజీ సీఎ జగన్‌పై పోలీస్ కేసు నమోదైంది . గుంటూరులో జగన్ మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
వైసీపీ అధినేత మాజీ సీఎ జగన్‌పై పోలీస్ కేసు నమోదైంది(Police Case On YS Jagan). గుంటూరులో జగన్ మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా దానిని ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు పోలీసులు.
జగన్ తో(YS Jagan) పాటు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు వాహనాలు నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారని(Guntur Mirchi Yard).. మిర్చి యార్డులోకి సరుకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని పోలీసులు కేసు నమోదు చేశారు.
Case registered against former CM YS Jagan
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు
గుంటూరులో మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు
మిర్చి యార్డ్లో పర్యటన నేపథ్యంలో మొత్తం
8 మంది వైసీపీ నేతలపై కేసులు
వైసీపీ నేతలు అమలులో ఉన్న ఎన్నికల కోడ్ ను
బేఖాతరు చేశారన్న పోలీసులు pic.twitter.com/ZyAG1TcBHd
— BIG TV Breaking News (@bigtvtelugu) February 20, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 20, 2025 08:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

