ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు, తెనాలి చెంచుపేటలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడు స్కూటీపై మాస్క్ వేసుకొని వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు.
మృతుడు అమర్తులూరు మండలం, కోడితాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చెంచుపేట లో కూతురిని ఇంటికి వచ్చి టిఫిన్ చెయ్యటానికి బయటకు వెళ్లిన వ్యక్తిపై దుండగుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం సమాచారం తెలియాల్సి ఉంది.
Man Brutally Attacked and Killed in Broad Daylight
పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
గుంటూరు, తెనాలి చెంచుపేటలో దారుణం. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని నరికి చంపిన దుండగుడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు. దుండగుడు స్కూటీపై మాస్క్ వేసుకొని వచ్చి… pic.twitter.com/Hhdr4EsOOI
— ChotaNews App (@ChotaNewsApp) October 14, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)