ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి రైల్వే క్రాసింగ్‌ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించి అది బెడిసికొట్టడంతో రైలు కింద పడి మృతి చెందాడు. వైరల్ వీడియో ప్రకారం.. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని దాద్రి ప్రాంతంలో నివసించే తుషార్ అనే వ్యక్తి ఆదివారం బైక్‌పై నోయిడాకి వెళుతూ.. ఒక రైల్వే క్రాసింగ్‌ వద్ద పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్‌ స్లిప్ కావడంతో పట్టాలపై పడ్డాడు.

వైరల్ వీడియో ఇదిగో, అబ్బాయిని లాగి చెంపమీద ఒక దెబ్బ పీకిన అమ్మాయి, బిత్తరపోయిన చూస్తుండిపోయిన అబ్బాయి.. ఆ తర్వాత ఏమైందంటే..

పైకి లేచిన అతడు బైక్‌ తీస్తుండగా రైలు దూసుకువచ్చింది. తప్పించుకునేలోపు రైలు ఢీకొట్టి వెళ్లింది. దీంతో అతను రైలు కింద పడి నుజ్జు నుజ్జు అయ్యాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.ఘటనపై ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుషార్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Biker gets hit by train while crossing railway track in Greater Noida 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)