ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు అన్ని కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రకటించింది.
...