గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంద్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మరోసారి వర్షసూచన ఉందని ఐఎండీ(IMD) హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని, ఇది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
...