ఏపీ పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని... వారికి పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని... అప్పుడు ఈ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి... గుడ్డలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు.
...