Kakani govardhan Reddy (photo/ySRCP/X)

Nellore, Jan 22: ఏపీ పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని... వారికి పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని... అప్పుడు ఈ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి... గుడ్డలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు.

రేపటి రోజున మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పోలీసులు ఊహించుకోవాలని అన్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోళ్లదిన్నెలో జరిగిన దాడుల్లో గాయపడిన...YCP సానుభూతిపరుడిని కావలిలోని ఆస్పత్రిలో కాకాణి పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నేను, విజయసాయి రెడ్డి వస్తాం, నీవు చెప్పేవి నిజాలే అయితే కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ముందా, సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన కాకాణి గోవర్థన్ రెడ్డి

బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గాయాలపాలైన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి ఆవరణలో వైసీపీ వర్గీయులు కత్తులు పట్టుకుని హల్ చల్ చేశారు.

Kakani Govardhan Reddy slams AP Police

దీంతో, ఆసుపత్రి వద్ద మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ వాళ్లను కాకాణి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు టీడీపీ వాళ్లకు సహకరిస్తున్నారంటూ కౌంటర్ అటాక్ ఇచ్చారు. పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.