తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక (Tuni Municipal Vice Chairman Election) మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో నాలుగోసారి ఎన్నికను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికను రద్దు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు.
...