మూడేళ్ళుగా చేపట్టిన సంక్షేమాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార పార్టీ మంత్రులు బస్సు యాత్రకు (Ministers Bus Tour) సిద్ధమయ్యారు. ఈమేరకు వైసీపీ అధిష్టానం పూర్తి కార్యాచరణ సిద్ధం చేసింది. మే 26 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు విశాఖపట్నం టూ అనంతపురం బస్సు యాత్ర చేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.
...