ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం. రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్‌ను (Vizag Steel Plant) నడిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి (Kumara Swamy) శుక్రవారం వెల్లడించే అవకాశముంది.
...